విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇస్తున్న ఉచిత హామీలు రాష్ట్ర ఆదాయాన్ని మించిపోతున్నాయని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. 36 వేల కోట్ల రూపాయల రైతు రుణాలను, డ్వాక్రా మహిళల రుణాలను, ఇతరాలను మాఫీ చేస్తానని చంద్రబాబు అంటున్నారని, చంద్రబాబు చెబుతున్న మాఫీల మొత్తం 86 వేల కోట్ల రూపాయలని, రాష్ట్ర ఆదాయం 50 వేల కోట్ల రూపాయలేనని, చంద్రబాబు ఇస్తున్న హామీలు రాష్ట్రాదాయన్ని మించి పోతున్నాయని ఆయన అన్నారు. విశాఖపట్నం జిల్లాలో ఆయన శుక్రవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు.
చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీలను నమ్మడానికి తాము చెవుల్లో పూలు పెట్టుకుని లేమని ఆయన అన్నారు. ఎన్నికల కోసమే చంద్రబాబునాయుడు ఉచిత హామీలు ఇస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.