వైయస్ కు గుండె దడ: బాబు

ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే రాష్ట్రంలోని ప్రతిపక్షాలను ముఖ్యమంత్రి కుక్కలతో పోల్చటం వైయస్ రాజశేఖర రెడ్డి దురహంకారానికి పరాకాష్ట అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హద్దులు మీరి మాట్లాడుతున్నారని ఆయన కరీంనగర్ లో అన్నారు. తెలంగాణా విద్యావంతులు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే వైయస్ కు గుణపాఠం చెబుతారని అన్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆయన సోమవారం కరీంనగర్ బాలికల జూనియర్ కాలేజీలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. తెరాస అభ్యర్థి గెలిచి తీరుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటారని అడగ్గా సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు.
తాము అధికారంలోకి రాకుంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే అని ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించటాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తప్పుపట్టారు. వై.ఎస్ హయాంలోనే రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. ప్రజా సమస్యలపై తలపెట్టిన సమరభేరీని ఆయన సోమవారం హైదరాబాదులో ప్రారంభించారు. ప్రజల సమస్యలను పరిష్కరించటంలోను, శాంతిభద్రతల విషయంలోను ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎస్‌ఈజెడ్‌ల పేరుతో వైయస్ నయా నిజాంలను పుట్టిస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, సిపిఎంలతో పొత్తులు ఖరారయ్యాయని, తెరాసతో ఖరారవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications