పితృవాదం కేసు: తివారీకి ఊరట

ND Tiwari
న్యూఢిల్లీ: పితృవాదం కేసులో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ఎన్‌డీ తివారీకి ఊరట లభించింది. వ్యక్తిగత హాజరునుంచి ఆయనకు మినహాయింపు లభించింది. తివారీ తనకు తండ్రి అంటూ కేంద్ర మాజీ మంత్రి షేర్ సింగ్ మనవడు రోహిత్ శేఖర్ దాఖలు చేసిన పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే, ఈ కేసులో తమ ముందు తివారీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ తివారీ తరఫు న్యాయవాది డివిజన్ బెంచ్ కు వెళ్లారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంటుందని, గవర్నర్ పదవిలో ఉన్న తివారీ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వ్యక్తిగతంగా హాజరు కావడం వల్ల ప్రతిష్ట దెబ్బ తింటుందని, అందువల్ల వారు హాజరు కావాల్సిన అవసరం లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలియజేస్తూ ఈ నిబంధనల మేరకు తివారీ మరో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు మినహాయింపు కోరవచ్చని ఈ నిబంధనను పొందుపరుస్తూ మరో పిటీషన్‌ దాఖలుచేయాలని గవర్నర్‌కు కోర్టు సూచించింది.

కేసును కొట్టేయాలని తివారీ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. తివారీతో వైవాహికేతర సంబంధంతో తన తల్లి ఉజ్వల సింగ్ కు తాను పుట్టానని, అందువల్ల తనను తివారీ కొడుకుగా అంగీకరించాలని రోహిత్ శేఖర్ అంటున్నాడు. తనను కొడుకుగా అంగీకరించడానికి తివారీ నిరాకరించారని తన కుమారుడు కోర్టుకు వెళ్లాడని, తన కుమారుడికి ఆ హక్కు ఉందని రోహిత్ శేఖర్ తల్లి ఉజ్వల సింగ్ అప్పట్లో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+