నటి భార్గవి అనుమానాస్పద మృతి

భార్గవి దేహంపై గాయాలున్నాయి. దీంతో ఆమెది హత్య అయి వుండవచ్చునని అనుమానిస్తున్నారు. భార్గవిది గుంటూరు జిల్లా గోరంట్ల గ్రామం. ఆమె అమ్మమ్మ డాట్ కామ్ తో మంచి పేరు తెచ్చుకుంది. టీవీ నటిగా గుర్తింపు పొంది ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేసింది. నాలుగేళ్ల క్రితం ఆమెకు పెళ్లయింది. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. హైదరాబాదులో ఆమె తల్లితో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆష్టాచెమ్మా సినిమాలో రెండో హీరోయినుగా ఆమె నటించింది. అపార్టుమెంటులో రెండు శవాలు పడి ఉన్నాయి. పడకపై ఆ శవాలు పడి ఉన్నాయి. మరణించిన వ్యక్తి మేనమామనా, బాయ్ ఫ్రెండా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications