నల్లగొండలో చిరంజీవిపై కేసు
నల్లగొండ: నల్లగొండలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై కేసు నమోదు చేశారు. రాత్రి పదిగంటల తర్వాత బహిరంగ సభలో మాట్లాడారని ఆరోపిస్తూ పోలీసులు ఆదివారం ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయనపైనే కాకుండా మరో ఐదుగురు ప్రజారాజ్యం పార్టీ నాయకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి చిరంజీవి నల్లగొండలో పది గంటలు దాటిన తర్వాత బహిరంగసభలో మాట్లాడినందుకు అడ్డుకున్నారు కూడా. మైక్ తీసేసి ఆయన బహిరంగ సభను పోలీసులు అడ్డుకున్నారు.
హైకోర్టు రోడ్ షోలపై నిషేధం విధించిన తర్వాత చిరంజీవి తొలిసారి నల్లగొండ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించారు. శనివారం రాత్రి నల్లగొండలో ఆయన ముగింపు సభ జరిగింది. సభకు వచ్చిన చిరంజీవి పది గంటలు దాటినందున తాను మాట్లాడకూడదని అంటూనే 20 నిమిషాల పాటు ప్రసంగించి ముగించే ప్రయత్నం చేశారు. అయితే అభిమానులు గొడవ చేయడంతో మరో ఐదు నిమిషాలు ప్రసంగించారు. దాంతో పోలీసులు మైక్ తీసేసి, ఆదివారంనాడు ఆయనపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications