విచారణకు ముందే క్లీన్‌చిట్ ఎలా ఇస్తారు?
హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం అవినీతిమయంగా మారిందని తాము చేస్తున్న ఆరోపణలకు ఈఈ సూర్యనారాయణ ఉదంతమే తార్కాణమని విపక్షాలు విమర్శించాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో ఈరోజు సమావేశమైన వామపక్ష, తెరాస నేతలు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.ఈఈ సూర్యనారాయణ అవినీతిలో మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భాగం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతుంటే ఓ వైపు విచారణ జరుపుతామంటూ మరోవైపు మంత్రులంతా మంచివారని సీఎం క్లీన్‌చిట్ ఇస్తున్నారని వారి చిత్తశుద్ధి ఎంతో దీన్ని బట్టే తెలుస్తోందనిసీపీఎం కార్యదర్శి రాఘవులు, సీపీఐ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. విచారణకు ముందే ఎలా సర్టిఫికెట్లు ఇస్తారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ప్రభుత్వ అవినీతిపై తామంతా కలిసి పోరాడతామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications