నర్సాపురం లేదా తిరుపతి నుంచి 'చిరు'

ఇటీవలే ప్రజారాజ్యం పార్టీలో చేరిన తోట చంద్రశేఖర్ గుంటూరు లోక్‌సభ నుండి పోటీచేయవచ్చు. పార్టీలో తెలంగాణ వ్యవహారాలు చూస్తున్న కేంద్రమాజీ మంత్రి శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్‌కుమార్ ఎల్‌బీనగర్ లేదా సనత్‌నగర్ నుండి పోటీ చేయించడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి దంపతులు నంద్యాల లోక్‌సభ, ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానాల నుండి పోటీచేసేది ఖాయమే. కాకపోతే ఎవరు ఎక్కడ పోటీ చేసేది పరిస్థితులను బట్టి ఉండవచ్చు.
కోటగిరి విద్యాదర్‌రావు ఏలూరు లోక్‌సభకు, తమ్మినేని సీతారాం శ్రీకాకుళం లోక్‌సభకు పోటీ చేసే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. చిరు పార్టీ పెట్టక ముందు నుండే ప్రజల్లోకి వెళ్లిన చిరు సోదరుడు నాగబాబు చోడవరం నుండి బరిలోకి దిగే అవకాశం ఉంది. వంగగీత తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుండి పోటీ చేయవచ్చు. యువరాజ్యం బాధ్యతలు అప్పగించిన చిరంజీవి మరో సోదరుడు రంగారెడ్డి మహేశ్వరం నుండి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనా మరికొన్ని రోజులు ఆగితేగానీ ఎవరు ఎక్కడి నుండి పోటీ చేసేది తెలియదు.












Click it and Unblock the Notifications