ఒక ఐఎఎస్ అధికారి ఆవేదన
హైదరాబాద్: తనకు పదోన్నతి కల్పించాలంటూ ప్రభుత్వానికి సూచించాలని, తనకు వ్యతిరేకంగా కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ రాజ్‌భవన్ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.జి.గోపాల్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తనకు సూపర్ టైప్ స్కేలు ప్రకారం జీతం చెల్లిస్తున్నారని.. అయితే, ఆ తర్వాత హోదాకు తాను అర్హుడనని పేర్కొన్నారు. తనకంటే జూనియర్లు కూడా ఆ హోదా పొందుతున్నట్టు ఆయన రిట్‌లో వివరించారు. గోపాల్‌పై సీబీఐ నమోదు చేసిన కేసు కోర్టు విచారణలో ఉన్నందున పదోన్నతి గురించి ప్రభుత్వానికి సూచనలు చేయడానికి క్యాట్ నిరాకరించిన విషయం విదితమే.












Click it and Unblock the Notifications