టిడిపి నేత నేడు ప్రజారాజ్యం గూట్లోకి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు నేడు చిరంజీవి "ప్రజారాజ్యం" పార్టీలో చేరనున్నారు. డాక్టర్ రామారావుది ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఆయన కొంత కాలంగా బాధ పడుతున్నారు. జిల్లా తెలుగుదేశం రాజకీయాలను కరణం బలరాం ఒంటి చేత్తో నడిపించడం, మాజీ మంత్రినైనా తన సలహాలను వినకపోవడం పాలేటికి బాధ కలిగించిందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
మంత్రిగా పనిచేసినా డబ్బు సంపాదన అంటే తెలియని రామారావు నిజాయితీ ప్రజారాజ్యం మేధావులను ఆకర్షించింది. వారు ఆహ్వాన సంకేతాలు పంపగా అందుకు అనుగుణంగా రామారావు ప్రతిస్పందించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన తమ్మినేని సీతారాం, రామచంద్రయ్య, విద్యాధరరావు వంటి పెద్ద నాయకులు ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications