వంద రోజులు ఓర్చుకోండి: చంద్రబాబు
హైదరాబాద్: 'అరాచకం ఇక వందరోజులే. నాలుగు నెలలాగండి' రాష్ట్రానికి మంచిరోజులొస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌ను మరో పులివెందుల కానివ్వబోమని ప్రకటించారు. అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. భీంరావుబాడ ఘటనపై రాష్ట్రాన్ని దిగ్బంధిస్తామని, జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామని ప్రకటించారు.
శనివారం నాంపల్లిలోని భీంరావుబాడ కూల్చివేత జరుగుతున్న ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. కూల్చివేతలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీంరావుబాడ వాసులు భయపడొద్దని, అధికారంలోకి వస్తే ఇక్కడే ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. 1995లో బస్తీవాసులకు తాము పట్టాలిచ్చామని గుర్తు చేశారు. కొంపల కూల్చివేతలో పాల్గొన వద్దని పొక్లెయిన్ డ్రైవర్లు, హోంగార్డులు, పోలీసులను ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు.












Click it and Unblock the Notifications