ఇక రాష్ట్రంలో జయప్రద హల్ చల్
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ నేత జయప్రద కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. అధినేత ములాయంసింగ్ యాదవ్ జయప్రదను పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమించారు. సొంతరాష్ట్ర ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించిందుకు జయప్రద ములాయంకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల వారీగా తిరిగి, చివరికి రాష్ట్ర కార్యవర్గాన్ని నియమిస్తానని శనివారం విలేకరులకు చెప్పారు. సమాజ్‌వాదీ మద్దతు లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయజాలదని ప్రకటించారు.
కొంతకాలం తెలుగుదేశం పార్టీలో ప్రముఖ పాత్ర వహించిన జయప్రద ఆ తర్వాత తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆవేదనతో సమాజ్ వాది పార్టీలో చేరారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో ఆమె ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లోక్ సభ స్ధానం నుంచి సమాజ్ వాది పార్టీ ఎంపీగా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications