కాశ్మీర్: కాంగ్రెస్ పై ఒమర్ ఆశలు
కాశ్మీర్: కాంగ్రెస్ పై ఒమర్ ఆశలు శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఫలితాల్లో ఇప్పటివరకూ ఆధిక్యాన్ని కనబరుస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటివరకూ ఎన్‌సీకి 27 సీట్లు వచ్చి ఆధిక్యంలో ఉందనీ, భావసారూప్యమున్న కాంగ్రెస్ పార్టీని కలిసి ప్రభుత్వ ఏర్పాటును ప్రతిపాదిస్తామని ఎన్‌సీ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా చెప్పారు.
ప్రతిపక్షంలో కూర్చుంటాం: బిజెపి జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టమవుతున్నకొద్దీ పార్టీలు తమ భవిష్యత్తు వ్యూహంపై సమాలోచనలు మొదలుపెట్టారు. కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే ప్రకటించారు. తాము ఏ పార్టీకీ మద్దతు ఇవ్వబోమనీ, ప్రతిపక్షంలో కూర్చుంటామని భాజపా ఈ మధ్యాహ్నం ప్రకటించింది.












Click it and Unblock the Notifications