'మాదిగ విద్యార్థి గర్జన'

Mandakrishna Madiga
హైదరాబాద్: జనవరి 27న హైదరాబాద్‌లో 'మాదిగ విద్యార్థి గర్జన'ను నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఆదివారం ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం నాటకాన్ని సహించేది లేదని, వర్గీకరణపై తాడోపేడో తేల్చుకోవాలని అన్నారు. అలాగే శనివారం జరిగిన ఎమ్మార్పీఎస్‌ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం తీర్మానం చేసిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు.

జనవరి 5న అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, 6న మండలాలు, జిల్లా కేంద్రాల్లో నిరసన సభలు నిర్వహిస్తామన్నారు. 7 నుంచి 19వరకు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, సభలు కొనసాగుతాయన్నారు. 20 నుంచి 26 వరకు మండల కేంద్రాల్లో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో తాడోపేడో తేల్చుకుంటామని చెప్పారు. రాజ్యాంగంలోని 341 అధికరణం వర్గీకరణకు అడ్డం కానే కాదని, అసలు దాని వల్ల సమస్య ఉత్పన్నం కాదని వివరించారు.

కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఒప్పించి తాజాగా ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టేలా చూస్తానని హామీ ఇచ్చిన వైఎస్‌ మాటను నిలబెట్టుకోలేదన్నారు. ఎస్సీల వర్గీకరణపై ముఖ్యమంత్రి వైఎస్‌ మాదిగలను నవ్వుతూ మోసగించారని ఆయన అన్నారు. జనవరి మొత్తం నిరసనమాసంగా పాటిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+