రెండు గంటల్లోనే తిరుమల శ్రీవారి దర్శనం
తిరుపతి: సంవత్సరాంత సెలవుల కారణంగా భారీ రద్దీ ఉంటుందని ఆశించినా అటువంటిదేమీ జరగలేదు. తిరుమలకు ఈరోజు ఆశించిన స్థాయిలో భక్తుల తాకిడిలేదు. ఈరోజు ఉదయం శ్రీవారి దర్శనానికి ఎలాంటి రద్దీ లేదు. ఉచిత దర్శనం కంపార్టుమెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఉచిత దర్శనానికి రెండుగంటలకు మించి సమయం పట్టటం లేదు. కొత్త సంవత్సరం కావటంతో ఆ ప్రభావం కనిపిస్తోంది. కాటేజీలు మాత్రం మందే రిజర్వ్ కావటంతో గదులు మాత్రం దొరకటం లేదు.












Click it and Unblock the Notifications