టీడీపీకి కళా రాజీనామా
శ్రీకాకుళం: టీడీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉణుకూరు ఎమ్మెల్యే కిమిడి కళా వెంట్రావు, పాలకొండ ఎమ్మెల్యే జోగులు తమ పార్టీ సభ్యత్వాలకు,ఎమ్మెల్యే పదవులకు ఈ రోజు రాజీనామాలు చేశారు. పార్టీలో తాము కొనసాగలేనిపరిస్థితి ఉన్నందునే రాజీనామాలు చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీలో తమ్మినేని సీతారాంతో ప్రారంభమైన వలసలు కొనసాగుతున్నాయి. ఈరోజు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామానా చేయటం టీడీపికి ఊహించని షాకే అయ్యింది. ఇక ఈ సందర్భంగా వెంకట్రావు.. చిరంజీవి మచ్చలేని మణిహారం వంటి వాడని, తెల్లకాగితం వంటి వాడని ప్రశంసించారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ సైనికులు లేని సైన్యంలా మారిందని అన్నారు.












Click it and Unblock the Notifications