సంపూర్ణ సంక్షేమ నామసంవత్సరం:వైఎస్
హైదరాబాద్: గడిచిన నాలుగున్నరేళ్లు రాష్ట్రానికి సువర్ణధ్యాయమని, గణనీయమైన అభివృద్ధి జరిగినా, చేయాల్సింది ఇంకెంతో ఉందని, శాచ్యురేషన్ ప్రాతిపదికన నూటికి నూరుపాళ్లు ప్రయోజనాలను పరిపూర్ణం చేయడానికి విధివిధానాలను సిద్ధం చేశామని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రజలకు మరింత అభివృద్ధి, సంక్షేమాన్ని అందించబోయే నూతన సంవత్సరాన్ని సంపూర్ణ సంక్షేమ నామసంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి తెలిపారు.
ఈ రోజు (గురువారం) నుంచి ప్రారంభమయ్యే కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆ మేరకు సీఎం సందేశమిచ్చినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య, ఆహార, సామాజిక భద్రత కల్పించామన్నారు. 2009లో అదనంగా రూ.30 వేల కోట్ల పంటరుణాలు, మహిళలకు పావలా వడ్డీ కింద రూ.20 వేల కోట్ల రుణాలు, జలయజ్ఞానికి రూ.20 వేల కోట్ల నిధులు, యువత ఉపాధికి రూ. వెయ్యి కోట్లు, సంక్షేమ రంగానికి రూ.40 వేల కోట్లు వెచ్చించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేస్తామని చెప్పినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications