బస్సులు తగలపెట్టిన ఆటో డ్రైవర్స్
కోల్‌కత్తా: ర్యాలీగా రోడ్డు పైకి వచ్చిన ఆటో డ్రైవర్లు పోలీసులపై ఆగ్రహించి హింసకు దిగారు. మూడు బస్సులను,పలు ప్రేవేట్ వాహనాలను తగలపెట్టేసారు. కాలుష్యానికి కారణమవుతున్న ఆటోలపై కోల్‌కత్తా హైకోర్టు విధించిన నిషేధానికి నిరసనగా నగరంలో ఆటోడ్రైవర్లు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ మద్దతుతో ఆటో డ్రైవర్లు రోడ్లపైకి వచ్చి ర్యాలీ నిర్వహిస్తుండగా, పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. పోలీసులపై ఆగ్రహించిన ఆటోడ్రైవర్లు రోడ్లపై హింసకు దిగారు. బస్సులను, పలు ప్రైవేటు వాహనాలను తగులబెట్టారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు అదనపు పోలీసు బలగాలను అక్కడికి పంపినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications