కడప:యువరాజ్యం సేవా సమితి పేరిట 06 అక్టోబరు 2008న రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని ఆ సమితి వ్యవస్థాపకుడు నగరానికి చెందిన యువ రాకేష్ తెలిపారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. యువరాజ్యం సేవా సమితి 171/2008 పేరిట తను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానన్నారు. ఈమేరకు చిరంజీవికి, పవన్‌కళ్యాణ్‌కు లీగల్ నోటీసులు పంపానని తెలిపారు.