సత్యం-మేటాస్ పై విచారణ:వైఎస్

మేటాస్ ప్రాపర్టీస్‌కు భారీ ప్రాజెక్టులు కేటాయించినందున వాటిపై ఏమేరకు ప్రభావం పడుతుందో పరిశీలిస్తున్నామని తెలిపారు. షేరు హోల్డర్ల తరపున క్రిమినల్ కేసు పెట్టేందుకు అవకాశాలున్నాయా అనే కోణంలో పరిశీలిస్తున్నామని చెప్పారు. మేటాస్ ప్రాపర్టీస్ చేపట్టిన ప్రాజెక్టుల పనితీరుపై అంచనా వేయాలని,పరిస్థితులు పరిశీలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించామని చెప్పారు. సత్యం కంప్యూటర్స్ పరిణామాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని తెలిపారు. రామలింగరాజు చెప్పిన మాటల్లోనే అక్కడ ఏమి జరుగుతుందో వెల్లడవుతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications