చిరు రక్తం అమ్మకం ఆధారమిదే:తులసి రెడ్డి

తన దగ్గరున్న తెల్ల కార్డుని చూపి రక్తం ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే డబ్బులు ఇవ్వనిదే రక్తం ఇచ్చేది లేదని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఖరాఖండిగా చెప్పటంతో విజయ్ కుమార్ నివ్వెరపోయారు. చివరకు చేసేదేమీ లేక రూ.375 రూపాయలు చెల్లించి రక్తం తీసుకున్నారు. ఆ డబ్బుకు రశీదు తీసుకున్నాడని తులిసిరెడ్డి పేర్కొన్నాడు. డబ్బులు తీసుకుని రక్తం సరఫరా చేసినట్లు కాంగ్రేస్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలంటూ సవాలు విసిరిన ప్రజారాజ్యం నాయుకుడు కోటగిరి విధ్యాధరరావు ఇప్పుడేమంటారని ఆయన ప్రశ్నించారు. అలాగే అనవసరమైన ఆరోపణలు చేయాల్సిన ఖర్మ కాంగ్రేసుకి పట్టలేదని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications