అసోంలో మళ్ళీ ప్రేలుడు
గౌహతి:అసోంలోని గౌహతి నగరంలో శుక్రవారం సాయంత్రం బాంబుపేలుడు సంభవించింది. ఆ దుర్ఘటనలో ముగ్గురు దుర్మరం పాలయ్యారు. ఏడుగురికి గాయాలయ్యాయి. మాలిగాన్ రైల్వే టౌన్‌షిప్ వద్ద రెండు కార్ల మధ్య ఉన్న సైకిల్‌కు దుండగులు అమర్చిన బాంబు సాయంత్రం 6.30గంటలకు పేలిందని పోలీసులు తెలిపారు. పేలుడు తీవ్రత తక్కువగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. పేలుళ్ల వెనుక నిషేధిత ఉగ్రవాద సంస్థ ఉల్ఫా హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications