హైదరాబాద్:నిన్న(శుక్రవారం)రాత్రి తొమ్మిది గంటల సమయంలో 'సత్యం' రామలింగరాజు ని అరెస్టు చేసామని పోలీసులు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం విచారణకు హాజరై తీరాలని సెబీ స్పష్టం చేసిన నేపథ్యంలో నగర శివార్లలోని కొంపల్లి లో ఉన్న రామలింగరాజు డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. నేరుగా సీఐడీ అదనపు డైరెక్టరు జనరల్ ఏ.శివనారాయణ, ఐజీ కౌముదిల ఎదుట హాజరయ్యారు. రామలింగరాజుతోపాటు ఆయన సోదరుడు, సత్యం కంప్యూటర్స్ మాజీ మేనేజింగ్ డైరెక్టరు బి.రామరాజు వచ్చారు. అనంతరం పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు.అయితే రామలింగరాజు లొంగిపోయారని మొదట వార్తలొచ్చాయి. కానీ వాటిని డీజీపీ తోసిపుచ్చారు. తామే అరెస్టు చేశామని ఆయన వెల్లడించారు.