సిగ్గుపడాల్సిందే:చిరు

ఇప్పటికీ వారికి విషజ్వరాలు ప్రబలితే మంచాలపైనే వారిని మోసుకెళ్లాల్సిన దుస్థితి. రవాణా సౌకర్యాలు మృగ్యం... రాజ్యాంగం ప్రకారం గిరిజనానికి బడ్జెట్‌లో ఆరు శాతం నిధులను కేటాయించాలని, కానీ ఎప్పుడూ రెండు, మూడు శాతానికి మించడం లేదని తెలిపారు. కనీసం వాటినైనా నూరు శాతం ఖర్చుచేసి సక్రమంగా గిరిజనుల దరి చేర్చి ఉంటే బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగి ఉండేదని... అవినీతి రాజ్యంలో చిత్తశుద్ధిలేని పాలకుల కారణంగా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారిందని ఆయన విమర్శించారు. కనీసం అటవీ ఉత్పత్తులపైనా ఆదివాసులకు హక్కు లేకుండా పోతోందని అన్నారు.
అలాగే ప్రజారాజ్యం అధికారంలోకి వస్తే గిరిజనులను సొంత బిడ్డల్లా సాకుతుంది. పెద్దపీట వేస్తుంది. సామాజిక న్యాయం అందిస్తుంది. వారికి సంబంధించిన అన్నిరకాల ప్రయోజనాలనూ కాపాడుతుంది'' అని పీఆర్పీ అధినేత చిరంజీవి అన్నారు. ఏళ్లతరబడి వివాదాస్పదంగా మారిన 'వన్ ఆఫ్ సెవెంటీ' (1/70) చట్టంపై లోతైన పరిశీలనతో అధ్యయనం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications