హత్య కేసులో పద్మక్కకు బెయిల్
కర్నూలు: కర్నూలు జిల్లాలో తెలుగుదేశం నాయకుడు కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో ప్రధాన నిందితురాలు వారం పద్మక్క కండిషన్ బెయిలుపై విడుదలైంది. గత సంవత్సరం మే 17న జరిగిన హత్య ఘటనలో 45 మందిపై కేసు నమోదు చేశారు. వీరిని రిమాండులో ఉంచారు.
7 నెలల అనంతరం పద్మక్కతో పాటు మరో 20 మందికి హైకోర్టు కండిషనల్ బెయిలు ఇచ్చింది. అయితే ఆమె కప్పట్రాళ్ల గ్రామంలోకి అడుగుపెట్టరాదని కోర్టు ఆదేశించింది. బెయిలుపై విడుదలైన ఆమెను పోలీసులు తమ వాహనంలో పంపుతామనగా ఆమె తనకోసం ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వాహనం పంపారంటూ అందులోనే వెళ్లింది.












Click it and Unblock the Notifications