కాంగ్రెస్ తో చచ్చినా కలవం : కెసీఆర్

చంద్రబాబు నివాసంలో మహాకూటమి నేతల సమావేశానంతరం కెసిఆర్ విలేఖర్లతో మాట్లా డుతూ, మహాకూటమి ఏర్పాటుకు ముహూర్తం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో చర్చకు తాను వారిని ఆహ్వానించినట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని, తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడమే తమ అంతిమ నిర్ణయమని కెసిఆర్ కుండబద్దలు కొట్టారు.
వోక్స్‌వ్యాగన్ నుంచి సత్యం వరకూ బయటపడుతున్న కుంభకోణాల పరంపరకు అడ్డుకట్ట వే సేందుకు, ఆకలి చావుల నుంచి ప్రజలను కాపాడి, వైఎస్ వెకిలి నవ్వులకు చరమగీతం పాడేందుకు మహాకూటమి తుది రూపు సంతరించుకున్నదని కెసిఆర్ చెప్పారు. ప్రతిపక్షాలకు బుద్ధిలేదని వైఎస్ చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications