హైదరాబాద్: సత్యం అనుబంధ మేటాస్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలు వెంటనే వెల్లడించాలని ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో సర్కారు దిగివచ్చింది. ఆ సంస్థతో నాలుగేళ్లలో సర్కారు కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలు రెండురోజుల్లో వెల్లడిస్తామని ఆర్థిక మంత్రి కె.రోశయ్య ప్రకటించారు. మేటాస్ సంస్థకు సంబంధించి తనకు పూర్తి వివరాలు తెలియదని తెలిపారు. గత నాలుగేళ్ళుగా మేటాస్ సంస్ధకు వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 38 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు పనులను అప్పగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ మెట్రో రైలు, మచిలీపట్నం పోర్టు ప్రధానమైనవి.