ఎన్టీఆర్ వర్ధంతిలోగా కాదు..

ఎన్టీఆర్ వేసిన ఆత్మగౌరవ పునాదులపై తాము అందించిన ఆత్మవిశ్వాసంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నారని ఆయన అన్నారు. అవినీతి,అరాచక పాలనతో వైఎస్ అందరికీ తలవంపులు తెచ్చారని విమర్శించారు. ప్రజలను క్షమాపణ కోరకుంటే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఎన్టీఆర్‌పై ఏర్పాటు చేసిన చిత్రపటాల ప్రదర్శనను చంద్రబాబు తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నేత్ర వైద్య, రక్త దాన శిబిరాలను సందర్శించారు.అదే సభలో .. తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీని విమర్శించారు. రంగు, రుచి, వాసన లేని కొత్త పార్టీ మహిళలకు ఎలాంటి న్యాయం చేయలేదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications