రోజాకి చిరు కౌంటర్

Chiranjeevi
విశాఖపట్నం: ప్రజారాజ్యం పార్టీకి రంగు రుచి వాసన లేవని కొందరు విమర్శిస్తున్నారు. అది నిజమే. మాది స్వచ్ఛమైన పార్టీ. స్వచ్ఛమైన నీటికి, గాలికి కూడా రంగు రుచి వాసన ఉండవు. విమర్శలు చేస్తున్న వాళ్లలా మేం రంగులు మార్చే వూసరవెల్లులం కాదు. అవినీతి రుచి మాకు తెలీదు. కుళ్లు రాజకీయాల వాసనలూ మాకు అంటవు' అని ప్రజారాజ్యం అదినేత చిరంజీవి తనపై విమర్శలు చేస్తున్న వారిపై నిప్పులు చెరిగారు.నాలుగు రోజులు క్రిందట తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా ప్రజారాజ్యం పార్టీ విధానాలను విమర్శిస్తూ..రంగు,రుచి లేని పార్టీ అనటాన్ని ఆయన తిప్పికొట్టారు.నిన్న సాయంత్రం వైజాగ్ ఆర్‌.కె.బీచ్‌లో మత్స్యకారుల మహాసభలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడారు.

అలాగే ప్రజల్ని ఎవరూ మోసం చేయలేరని, ప్రజలే న్యాయమూర్తులని వారే తగిన తీర్పు ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వంద రూపాయలకే వంట సరుకు పథకానికి, గ్రామీణులకు సగం ధరకే విద్యుత్‌ పథకానికీ మంచి స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్న చెరకు రైతులపై పోలీసులు దాడి చేయడాన్ని, కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఇక ఉత్తరాంధ్రలో ప్రజారాజ్యానికి లభిస్తున్న ఆదరణ పాలపొంగు వంటిదన్నారు. మరోసారి చిరంజీవి అక్కడికి వెళితే జనం రారన్నారు. కానీ రాజాంలోనూ, ఇక్కడా జనం నీరాజనాలు పలికారు. అవాకులు చవాకులు మాట్లాడుతున్న వాళ్లు ఒకసారి ఇక్కడకు వచ్చి చూసి మాట్లాడితే మంచిది. ఇది పాలపొంగు కాదని, సునామీ అని అర్థమవుతుంది' అని పేర్కొన్నారు. తమ పార్టీ మత్స్యకారులు, యువశక్తి, మహిళా శక్తి, చేనేత కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు... ఇలా అన్ని వర్గాలతో కలసి ఏర్పడిన మెగా కూటమి తమదని వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఒంటరి ఎలా అవుతుందని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+