ఎసిబికి చిక్కిన అవినీతి అధికారులు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఏసీబీ వలలో ఇద్దరు అవినీతి అధికారులు చిక్కారు. కరీంనగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐగా పనిచేస్తున్న మహమ్మద్ యూసుఫ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఓ ఆస్థి వివాదంలో 40 వేల రూపాయల లంచం డిమాండ్ చేసిన యూసుఫ్ అడ్వాన్స్‌గా 10 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. మహాముత్తారంలో తహసీల్దారుగా పనిచేస్తున్న బాలకిషన్ సుంకరి ఉద్యోగంకోసం భాస్కర్ అనే వ్యక్తి నుంచి 60 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. తన ఇంటివద్ద ఈరోజు అడ్వాన్స్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications