హైదరాబాద్: బిజెపిను వీడి తాను ప్రజారాజ్యం పార్టీలో చేరనున్నట్లు వచ్చిన వార్తలను సినీనటుడు కృష్ణంరాజు తోసిపుచ్చారు. ఆలాగే తాను ప్రజారాజ్యం పార్టీకి సన్నిహితంగా మెలుగుతున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని మీడియాకు స్పష్టం చేసారు.అంతేగాక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నర్సాపురం స్థానం నుంచి పోటీ చేయ నున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక భారతీయ జనతా పార్టీలో అంతర్గత కలహాలు, గ్రూపు రాజకీయాలు ఎక్కువైన మాట వాస్తవమేనని, మీడియా వ్యక్తులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. అలాగే కేంద్రంలో ఈసారి బిజెపినే ప్రభుత్వం స్దాపిస్తుందని దీమా వ్యక్తం చేశారు.