బాలయ్యకు సోదరిగా ఆశీస్సులు: పురంధరేశ్వరి

పార్టీలకు అతీతంగా నరసరావుపేటలో ఏర్పాటు చేసిన ఎన్‌టిఆర్ విగ్రహావిష్కరణకు మాత్రమే వచ్చామని, మరో రాజకీయ ఉద్దేశం లేదన్నారు. మహాకూటమి పై స్పందించ లేదు. సంక్షేమ ఫలాలు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. సమావేశంలో పర్చూరి శాసన సభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, జిడిసిసిబి చైర్మన్ నల్లపాటి శివ రామచంద్రశేఖరావు, డిసిసి మాజీ చైర్మన్ ముప్పలనేని శేషగిరిరావు, డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు, నల్లపాటి రామ చంద్రప్రసాదు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిట్టా విజయ భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌టిఆర్ విగ్రహావిష్కరణ సభలో బాలయ్య అభిమానుల కేరింతలు ఎన్‌టిఆర్ విగ్రహావిష్కరణ సభకు అధిక సంఖ్యలో బాలకృష్ణ అభిమానులు హాజరయ్యారు. జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాలయ్య జపం చేస్తూ కేరితంలు కొట్టారు. సభకు హాజరైన పురంధరేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వరరావులు బాలయ్యను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి హర్షధ్వానాలు వ్యక్త మయ్యాయి.












Click it and Unblock the Notifications