పవన్ ని కలవాలంటూ ఆందోళన

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ విద్యార్థులు వచ్చే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఓటు గనుక వేయకపోతే ప్రశ్నించే హక్కును సైతం కోల్పోతారని ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లో యువత పాత్ర చాలా తక్కువగా ఉన్నందున, ఇకపై వారు చొరవ తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అలాగే 90 శాతం యువత ప్రజారాజ్యం వెంటే ఉన్నదని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో దోపిడీని, అన్యాయాన్ని పారదోలే శక్తి యువతకు మాత్రమే ఉందన్నారు.












Click it and Unblock the Notifications