తెలంగాణపై వైయస్ మళ్ళీ అదే

నిన్న కూడా ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్‌లతో దాదాపు రెండు గంటలపాటు సమాలోచనలు జరిపిన అనంతరం వైఎస్ మీడియాతో మాట్లాడారు. అప్పుడూ ఇలాగే చెప్పుకొచ్చారు. తెలంగాణాపై అన్ని అంశాలను పరిశీలించి అధిష్ఠానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
తెలంగాణపై ఎన్నికల్లోపు అధిష్ఠానం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నారా? అని ప్రశ్నించగా... 'చూద్దాం. చూద్దాం. తెలంగాణ అంశాన్ని ప్రధానమైన అంశంగా పార్టీ భావిస్తోంది. దీనిపై సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని వెల్లడిస్తుంది'' అని బదులిచ్చారు. అదే సయంలో తెలంగాణపై పార్టీ ఎలాంటి వైఖరి తీసుకున్నా, తన ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో గెలుపు సాధ్యమని వైఎస్ చెప్పుకొచ్చారు. మళ్ళి ఇవాళా అదే మాట చెప్పటం చర్ఛనీయాంసంగా మారింది.












Click it and Unblock the Notifications