చిరుకు మహిళల ముద్దులు

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ...కాంగ్రెస్ పాలనలో గర్భిణులు శ్మశానంలోనూ బాత్ రూముల్లోనూ ప్రసవించాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రి పంచలో ప్రసవించాల్సిన దౌర్భాగ్యస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. 'ఇదేనా ప్రభుత్వ పనితీరు' అని ప్రశ్నించారు.ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని ప్రభుత్వం ఎందుకని నిలదీశారు.
వసతి గృహాల్లో బాలికలకు సబ్బులు, కొబ్బరినూనె వంటివి కూడా అందించడం లేదని, అధినేతల దృష్టంతా కమీషన్లు వచ్చే పెద్ద పెద్ద ప్రాజెక్టులపై ఉంది తప్ప పెద్దగా గిట్టుబాటు కాని ఇలాంటి సౌకర్యాల కల్పనపై లేదని ఎద్దేవా చేశారు. ముస్లిం పాఠశాలల్లో పిల్లలంతా చుట్టూ దడిగా నిలబడితే మూత్ర విసర్జనకు వెళ్లాల్సిన దుర్గతి నెలకొందని ఓ ఉర్దూ పత్రిక ఎడిటర్ చెబితే ఆశ్చర్యపోయానన్నారు. 11 మంది గిరిజన మహిళలపై అత్యాచారం జరగడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు.












Click it and Unblock the Notifications