షబ్బీర్‌ అలీ కొడుకునంటూ రేప్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తాను రాష్ట్ర మంత్రి షబ్బీర్‌ అలీ కుమారుడినని పరిచయం చేసుకున్న అమర్ అనే యువకుడు, అతడి స్నేహితులు(ముగ్గురు) తనపై అత్యాచారయత్నం చేశారంటూ ఓ యువతి బుధవారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు ఉన్నాయి.

నగరంలోని ప్రెవేట్‌ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువతి(18)కి రెండు నెలల క్రితం రొనాల్డ్‌ అనే యువకుడు.. అతని ద్వారా అమన్‌, చరణ్‌లు స్నేహితులయ్యారు. అమన్‌ తాను మంత్రి షబ్బీర్‌అలీ కుమారుడినని చెప్పుకోగా, చరణ్‌ ఓ సినీ హీరో కుమారుడినని పరిచయం చేసుకున్నాడు.పరిచయాలు పెరిగాక వీరంతా పబ్బులు, రిసార్టులకు వెళ్లేవారు. అలాగ్ మంగళవారం బాధితురాలికి ఫోన్‌ చేసి సాయంత్రం సమయంలో టోలీచౌకీ ప్రాంతంలోని గుట్టల్లోకి కారును తీసుకెళ్లారు. ఆమె చేత మత్తు కలిపిన కూల్ డ్రింక్ తాగించటానికి ప్రయత్నించారచు. ఆమె నిరాకరించటంతో ముఖం, ఛాతీపై కొట్టి..బలవంతంగా కూల్‌డ్రింక్‌ తాగించారు. దాంతో బాధితురాలు స్పృహ తప్పింది.

రాత్రి 10.30గంటల సమయంలో స్పృహలోకి వచ్చిన ఆమె తన ఒంటిపై దుస్తులు చెదిరి ఉండటం...అమన్‌, చరణ్‌లతోపాటు మరో ఇద్దరు కారులో ఉండటం గమనించింది. ఏడుస్తున్న ఆమెని ఆ నలుగురు అర్ధర్రాతి 12.30 గంటల సమయంలో సంజీవరెడ్డినగర్‌ సెంటర్ లో వదిలి వెళ్లిపోయారు. తర్వాత తెల్లవారుఝాము 3.30గంటల సమయంలో కూతురిని వెంటబెట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన తల్లి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేయించింది. కేసులు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆమెకు వచ్చిన ఫోన్‌ నెంబర్లు తీసుకున్నారు. ఈ ఆధారంతో విచారించగా అది టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత జలాలుద్దీన్‌ కుమారుడు జావీద్‌దిగా వెల్లడైంది.

ఇక, చరణ్‌దంటూ బాధితురాలు ఇచ్చిన నెంబర్‌ ఆధారంగా దర్యాప్తు జరుపగా అది కూకట్‌పల్లి నివాసి రాజేశ్‌దిగా తెలిసింది. ఈ ఇద్దరు గౌతమి, లిటిల్‌ఫ్లవర్‌ కాలేజీల విద్యార్థులని వెల్లడైంది. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Please Wait while comments are loading...