ట్రంప్ టీమ్ నుంచి తప్పుకొన్న శ్రీరామ్ కృష్ణన్: వైట్ హౌస్ కు గుడ్ బై

వైట్ హౌస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాలసీ అడ్వైజర్ శ్రీరామ్ కృష్ణన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెలాఖరుతో ఆయన బాధ్యతల నుండి తప్పుకోనున్నారు. రాజీనామా తర్వాత విరామం తీసుకుంటానని వెల్లడించారు. అనంతరం అమెరికా ఎదుర్కొంటున్న కీలకమైన ఏఐ సవాళ్ల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు. అమెరికా ప్రజలకు సేవ చేయడం తన జీవితంలో లభించిన అరుదైన అవకాశమని, అందుకు తాను ఎంతో కృతజ్ఞుడినని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన్ని కృష్ణన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ట్రంప్ నాయకత్వం లేకపోతే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికా ఇంతటి ఆధిక్యాన్ని సాధించేవాళ్లం కాదని స్పష్టం చేశారు. తనకు సహకరించిన వారికి, ఏఐ భాగస్వామ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రగతి కోసం తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఇందులో వెనుకంజ వేయబోనని స్పష్టం చేశారు.

Advisor Sriram Krishnan to Depart White House Will Tackle America s AI Challenges in a New Venture

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలను స్వీకరించిన ప్రారంభ రోజుల్లోనే వైట్ హౌస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాలసీ అడ్వైజర్ శ్రీరామ్ కృష్ణన్ ఎంపిక అయ్యారు. 18 నెలలుగా ఈ హోదాలో కొనసాగారు. పలు విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా అమెరికన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో అమెరికా ఏఐ సామర్థ్యాన్ని పెంచేందుకు వివిధ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోగలిగారు.

నేషనల్ ఏఐ పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను సిద్ధం చేయడంలో సక్సెస్ అయ్యారు. గ్లోబల్ ఏఐ సమ్మిట్ లల్లో అమెరికాకు ప్రాతినిథ్యాన్ని వహించారు శ్రీరామ్ కృష్ణన్. అమెరికా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానాల గళాన్ని గట్టిగా వినిపించారు. తన సహచరుడు డేవిడ్ సాక్స్ సహకారాన్ని ఈ సందర్భంగా కృష్ణన్ గుర్తు చేసుకున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికా అగ్రగామిగా నిలవాలనే సాక్స్ సంకల్పం కీలకమైందని పేర్కొన్నారు.

అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న ఇంధన వనరులు, డేటా సెంటర్లు, ఏఐ ప్రయోజనాలను సామాన్యులకు చేరవేసే మార్గాలపై దృష్టి సారించి, ఆ సమస్యలను పరిష్కరించే సంస్థలను నిర్మించడమే తన తదుపరి కార్యక్రమమని ఆయన వివరించారు. వైట్ హౌస్ పరిపాలనా యంత్రాంగంలోని కెవిన్ హాసెట్, జేడీ వాన్స్, ఎలాన్ మస్క్, పలురు సహోద్యోగులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వారి సహకారం, మద్దతు లేనిదే ఇవేవీ సాధ్యమయ్యేవి కాదని పేర్కొన్నారు. తన భార్య ఆర్తీ వెన్నంటి ఉండి ప్రోత్సహించారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+