హైదరాబాదీ ఎగ్ మలై మసాలా కర్రీ.. ఇలా చేస్తే రెస్టారెంట్ కు మించిన టేస్ట్..!

గుడ్డులో అనేక పోషకాలు ఉన్నాయి. గుడ్డు సంపూర్ణ ఆహారం అని వైద్యులు చెబుతారు. గుడ్డును రోజూ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు. గుడ్లను ఉడకపెట్టి తినడం లేదా ఫ్రై మాదిరి చేసుకోవడం చాలామందికి అలవాటే.. అయితే ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా రెస్టారెంట్ స్టైల్ లో హైదరాబాదీ ఎగ్ మలై మసాలా కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా..? ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ హైదరాబాదీ ఎగ్ మలై మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..

హైదరాబాదీ ఎగ్ మలై మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. గుడ్లు ఆరు ఉడికించినవి, ఉల్లిపాయలు రెండు సన్నగా తరుక్కోవాలి, పచ్చిమిర్చి మూడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా అర టేబుల్ స్పూన్, మిరియాల పొడి అర టేబుల్ స్పూన్, పసుపు పావు టేబుల్ స్పూన్, కారం పొడి ఒక టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె లేదా నెయ్యి రెండు టేబుల్ స్పూన్ లు, కొత్తిమీర తగినంత తీసుకోవాలి.

హైదరాబాదీ ఎగ్ మలై మసాలా కర్రీ తయారీ విధానం చూస్తే.. ముందుగా కడాయిలో నూనె వేడి చేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, కారం, పసుపు, జీలకర్ర, ఉప్పు వేసి కాసేపు మసాలా వేయించాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మసాలా బాగా చిక్కబడేంత వరకూ ఉడికించుకోవాలి.

EggMalai Masala Hyderabadi Style Easy Recipe for Taste That Beats Any Restaurant Ingredients List

ఇప్పుడు ఉడికించిన గుడ్లు వేసి మసాలాతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అలాగే కలుపుతూ మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా గరం మసాలా, మిరియాల పొడి వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వింగ్ చేసుకుంటే సరి.. సూపర్ టేస్టీ హైదరాబాదీ ఎగ్ మలై మసాలా కర్రీ రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+