కాంగ్రెస్ అవినీతి పుట్ట: బాలకృష్ణ

Balakrishna
అనంతపురం: ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అవినీతి ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయాయని తెదేపా నాయకుడు, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా గెలుపే లక్ష్యంలో ఆ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే ఉద్దేశంతో రాష్ట్రం వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన అనంతపురం జిల్లా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెజ్‌ల పేరుతో పేద ప్రజల భూమిని విపరీతంగా కాంగ్రెస్‌ సర్కారు దోచుకుందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆయన విమర్శించారు.

రాయలసీమలో అధిక ధరలు కలిగిన వ్యవసాయ భూములను కర్మాగారాల నిర్మాణానికి అందున సొంత వారికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటాయిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలకు ప్రజాస్వామ్యాన్ని భష్ట్రు పట్టించిన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల పేర్లు పెట్టడం శోచనీయమన్నారు. తెలుగు వారి కీర్తిని దశదిశల వ్యాప్తి చేసిన టంగుటూరి ప్రకాశం, సర్వేపల్లి రాధాకృష్ణ, పి.వి.నరసింహారావు, నీలం సంజీవరెడ్డి లాంటి గొప్ప వాళ్ల పేర్లు ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+