టిడిపి-టీఆర్ ఎస్ పొత్తు ఖరారు
హైదరాబాద్: తెలుగుదేశం మహాకూటమికి, తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య పొత్తు కుదిరింది. తెలంగాణ ప్రాంతంలో వామపక్షాలకు ఇచ్చిన స్ధానాలు పోను మిగితా స్ధానాలను చెరి సగం చేసుకోడానికి టిడిపి, టీఅర్ ఎస్ అంగీకరించాయి. ఒప్పందం ప్రకారం పది లోక్ సభ స్ధానాలు, 46 అసెంబ్లీ స్ధానాలు తెలంగాణ రాష్ట్ర సమితికి కేటాయిస్తారు.
మహాకూటమిలోకి తెలంగాణ రాష్ట్ర సమితి చేరడంతో తెలంగాణలో ఈ కూటమి విజయం సాధించే అవకాశాలు మెరుగుపడ్డాయి. ముందు నుంచి తెదేపాతో పొత్తు పెట్టుకోవడానికి తెరాస ఆసక్తి చూపినా అధికారికంగా ప్రకటన చేయలేదు. దీంతో తెరాస ప్రజారాజ్యం వైపు వెళ్తుందన్న ఊహాగానాలు వచ్చాయి. వాటిని తోసిపుచ్చుత్తూ..తెదేపా అధినేత చంద్రబాబుతో మాట్లాడానికి కేసీఆర్ ఆయన ఇంటికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications