వ్యాస్, తప్పు చేస్తున్నారు: వైఎస్
హైదరాబాద్: తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, కృష్ణాజిల్లా మల్లేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యుడు బూరగడ్డ వేదవ్యాస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి స్వయంగా తెలియజేశారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి - కాంగ్రెస్‌ను విడిచి పెడ్తూ తప్పు చేస్తున్నారు. మరోసారి ఆలోచించుకోండి అని వేదవ్యాస్ కు సూచించారు. వేదవ్యాస్ బుధవారం ఉదయం ముఖ్యమంత్రిని కలిశారు.
శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరాలని వేదవ్యాస్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆయన గురువారంనాడు చిరంజీవి సమక్షంలో ప్రజారాజ్యం పార్టీలో చేరుతారు. తన నియోజకవర్గం ఒత్తిడి మేరకే తాను ప్రజారాజ్యంలో చేరుతున్నట్లు వేదవ్యాస్ చెప్పారు.












Click it and Unblock the Notifications