చిరు పార్టీలో వేదవ్యాస్ చేరిక
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించిన కృష్ణా జిల్లా మల్లేశ్వరం ఎమ్మెల్యే వేదవ్యాస్ ప్రజారాజ్యం పార్టీలో చేరారు. భారీసంఖ్యలో అభిమానులు వెంటరాగా పార్టీ అధినేత చిరంజీవి సమక్షంలో ఆయన గురువారం ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకున్నారు. శాసనసభా సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డికి అందజేశారు. కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయన బుధవారం ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసి తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తున్న విషయాన్ని తెలియజేశారు.












Click it and Unblock the Notifications