విజయవాడ: తమ కార్యకర్తలు చేస్తున్నవి దాడులు కాదని, ఆత్మగౌరవ పోరాటమేనని ఎమ్మార్పీస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాది అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ...వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఒక వేళ తమ డిమాండ్‌ను అంగీకరించకపోతే ఈ నెల 15న విశ్వరూప సభలో తదుపరి కార్యక్రమంను నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. వర్గీకరణపై మాదిగ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడకపోతే తమ కార్యకర్తలే బుద్ధి చెబుతారని ఆయన కృష్ణ మాదిగ హెచ్చరించారు.