అదిలాబాద్ జిల్లాలో పవన్ పర్యటన

పవన్ కళ్యాణ్ మొదటి రోజు పర్య టన అంతా ఎక్కువశాతం గిరిజన గూడెంలా వెంట సాగే విధంగా ఏర్పాట్లు చేశారు. కాగజ్‌నగర్‌లో రాత్రి బస చేసే ఆయన 8వ తేదీ అక్కడ జరిగే పిఆర్‌పి తూర్పు, పశ్చిమ జిల్లాల కార్యవర్గ సమావేశాలలో పాల్గొంటారు. అక్కడి నుండి నేరుగా తాండూర్ ఒసి బొగ్గు గనులను సందర్శిస్తారు. మందమర్రి కె.కె.2 బొగ్గు గనిలో దిగుతారు. అక్కడి నుండి మంచిర్యాలకు వెళ్లి అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని అక్కడే రాత్రి బసచేస్తారు.
తొమ్మిదివ తేదీ ఉదయం అక్కడి వివిధ వర్గాలతో జరిగే సమావేశంలో మాట్లాడుతారు. నేరుగా అక్కడ నుండి లక్ష్మణ చాందాకు చేరుకుం టారు. అక్కడ గల్ఫ్ బాధితులు, బీడీకార్మి కులతో మాట్లాడుతారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంత రం ముథోల్‌కు వెళ్తారు. బాసరకు వెళ్లి అక్కడ శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటారు. తిరిగి హైదరాబాద్‌కు వస్తారు.












Click it and Unblock the Notifications