కాంగ్రెస్‌లో కుటుంబపాలన :మోడీ
నాగ్‌పూర్ : కాంగ్రెస్‌లో కుటుంబపాలన కొనసాగుతోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. ఒకే కుటుంబానికి చెందిన వారు 37 సంవత్సరాలుగా దేశ ప్రధానమంత్రులుగా ఉన్న వైనాన్ని ఆయన ఆదివారంనాడు ప్రస్తావించారు. ముంబయిపై దాడులకు పాల్పడిన ముష్కరులకు భారత్‌లోని కొందరినుంచి సహకారం లభించిందని ఆయన ఆరోపించారు. దేశంలోని కొన్ని రాజకీయపక్షాలు ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. ఒబామాకు పట్టంకట్టి చరిత్ర సృష్టించిన అమెరికన్ ప్రజల ప్రజాస్వామ్యస్ఫూర్తి మనకు ఆచరణనీయమని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications