వైయస్ పాడు బుద్ధి: టిడిపి
విజయవాడ : పోతిరెడ్డిపాడు ద్వారా జలాలను వేరే జిల్లాలకు తరలిస్తున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శ్రీశైలం నుంచి ఎనిమిది వందల క్యూసెక్కుల నీటిని అక్రమంగా రెండో పంటకు మళ్లించడంతో సాగర్ మూడో జోన్‌కింద ఉన్న కృష్ణాజిల్లాలోని ఆయకట్టుకు కనీసస్థాయిలో నీరు కూడా అందివ్వలేకపోతున్నారని ఆయన ఆదివారంనాడు విమర్శించారు. నూజీవీడు, వేంపాడు మేజర్ బ్రాంచిల కింద నీళ్లులేక ఎండిపోయిన కాలువలను తెలుగుదేశం నాయకులు పరిశీలించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, హోం మంత్రి కె. జానారెడ్డి అక్రమంగా రాయలసీమకు, నల్లగొండ జిల్లాకు నీళ్లు మళ్లించారని ఆయన అన్నారు. వైయస్ పులివెందుల ప్రాంతంలోని రెండో పంటకు నీళ్లు మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications