కూటమికి 'మహా' ఓటమి: చిరు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని మహా కూటమికి ఓట్లు పడవని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. గుంటూరు జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు ఆయన సోమవారం హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ధైర్యం ఉంటే తెలంగాణకు అనుకూలంగా ఒకే వేదిక మీది నుంచి మహా కూటమి ప్రకటన చేయాలని ఆయన సవాల్ చేశారు.

ప్రజారాజ్యం తమకు పోటీ కాదని తెలుగుదేశం పోటీ కాకుంటే ఎందుకు తమపై ప్రకటనలు ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. తమకు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి అని ఆయన అన్నారు. అవినీతి ఎండగడుతూ ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. మార్పును కోరుకుంటున్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో తమకే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులో తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామని, తొలుత 50 - 60 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదల చేస్తామని, ఇందుకు అవసరమైన కసరత్తు జరుగుతోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+