హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సంస్థల రక్షణకే: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంస్థలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. శాసనసభ నుంచి సస్పెండ్ అయిన అనంతరం ప్రతిపక్షాల సభ్యులు బుధవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్ సంస్థల అక్రమాలపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సత్యం వ్యవహారంలో వాస్తవాలు వెల్లడించే వరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. సత్యం, మైటాస్ లపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి ఇచ్చిన సమాధానానికి వివరణ కోరితే తమను సస్పెండ్ చేశారని ఆయన చెప్పారు. ముందు అనుకున్న ప్రకారమే తమను స్పీకర్ సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు.

సస్పెన్షన్ అనంతరం మార్షల్ తమ సభ్యులపై దౌర్జన్యానికి దిగారని, శాసనసభ చరిత్రలో ఇంత దారుణం జరగడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. మహిళా శాసనసభ్యులపై అసభ్య పదజాలం వాడారని ఆయన ఆరోపించారు. తాము స్పీకర్ పోడయం వద్దకు వెళ్లలేదని, ఏ మాత్రం రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించలేదని, అయినా తమను సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. కొన్ని అక్రమాలకు సంబంధించిన ఆరోపణలను ముఖ్యమంత్రి అంగీకరించినట్లు ఆయన తెలిపారు. జగన్ కు చెందిన సండూర ఆర్థిక అవకతవకలు ఫెమా ఉల్లంఘనే అని ఆయన అన్నారు.

మార్షల్స్ తమను గెంటివేస్తుంటే ప్రత్యక్ష ప్రసారాలను ఎందుకు నిలిపేశారని సిపిఎం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య ప్రశ్నించారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సమాధి చేస్తారని ఆయన హెచ్చరించారు. శాసనసభా చరిత్రలో ఈ రోజు దుర్దినమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని ప్రజల్లో ఎండగడ్తామని సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X