న్యూఢిల్లీ: రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఓటాన్ అకౌంట్ రైల్వే బడ్జెట్‌ను ఈరోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆమ్ ఆద్మీ ప్రయోజనానికి కట్టుబడి వారిపై భారం మోపకుండానే రైల్వే ఆదాయాన్ని పెంచామని అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా పేదలపై భారం మోపని ఘనత తమదని ఆయన అన్నారు. ఇందుకు సోనియా గాంధీతో సహా అధికారపక్ష సభ్యులంతా బల్లలు చరిచి హర్షం ప్రకటించారు. 2001లో రైల్వే ఖజానా ఖాళీగా ఉండేదని ఈ అయిదేళ్లలో 90 వేల కోట్ల మిగులుతో రికార్డుస్థాయి ఆదాయం సాధించామని ఆయన అన్నారు.