Underwear Thief: వీడేం దొంగరా బాబు.. మహిళల అండర్ వేర్లు దొంగిలించి.. రాత్రంతా వేసుకుని..

సాధారణంగా దొంగలు ఎవరైనా ఖరీదైన, విలువైన వస్తువుల్ని దొంగతనం చేస్తుంటారు. ఇంకొంత మంది చిల్లర వస్తువులను కూడా దొంగిలిస్తుంటారు. మరికొందరు ఆహారం, తినే పదార్థాలు దొంగతనం చేస్తుంటారు. కానీ బెంగళూరుకు చెందిన ఈ దొంగ రూటే సెపరేటు.. అతడు దొంగతనం చేసేది ఏంటో తెలిస్తే మీరే షాక్ అవుతారు. ఇంతకీ ఏంటి..? అది అని అనుకుంటున్నారా..! ఈ యువకుడు మహిళల అండర్ వేర్ లు దొంగిలిస్తాడు. వాటిని రాత్రంతా వేసుకుంటాడు. మరుసటిరోజు రాత్రి వాటిని అక్కడే పెట్టేస్తాడు. మరో కొత్త అండర్ వేర్ ల కోసం వెతుకుతాడు. ఇతని పని అదే. ఈ దొంగ తాజాగా పోలీసులకు చిక్కడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Oh..! Sukumari First Review: రెండు నెలలకో హిట్టు కొడతావ్.. ఎలా అన్నా..?
Oh..! Sukumari First Review: రెండు నెలలకో హిట్టు కొడతావ్.. ఎలా అన్నా..?

బెంగళూరుకు చెందిన 23 ఏళ్ల యువకుడు రెసిడెన్షియల్ బిల్డింగ్ లోని టెర్రెస్ పై మహిళల అండర్ వేర్ లు దొంగిలించిన కారణంగా అరెస్ట్ అయ్యాడు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఆ అండర్ వేర్ లను యువకుడు రాత్రంతా ధరిస్తాడు. ఆ తర్వాత మరుసటిరోజు రాత్రి వాటిని తిరిగి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత వేరే వాళ్లవి దొంగిలిస్తాడు. బెంగళూరులోని హోయసల నగర్ లో ఈ విచిత్రమైన ఘటన జరిగింది. ఈ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉండే ఇద్దరు మహిళలు టెర్రస్ పై ఆరేసిన తమ అండర్ వేర్ లు మాయం కావడం.. మరుసటి రోజు రాత్రి అవి అక్కడే ప్రత్యక్షం కావడం గమనించారు.

ఓటీటీలోకి బుర్రపాడు చేసే మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..!
ఓటీటీలోకి బుర్రపాడు చేసే మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..!

ఈ ఘటనలతో విసుగు చెందిన అపార్ట్ మెంట్ మహిళలు టెర్రస్ పై సీసీటీవీ కెమెరాలను అమర్చారు. అయితే అర్ధరాత్రి 3 గంటల సమయంలో యువకుడు వచ్చి అంతకుముందు తీసుకెళ్లిన అండర్ వేర్ లను అక్కడ పెట్టి.. కొత్తగా ఉతికి ఆరేసిన అండర్ వేర్ లను దొంగిలించి పారిపోయాడు. ఇక పోలీసుల సమాచారం ప్రకారం నిందితుడు అస్సోం కు చెందిన అబ్దుల్ హుసేన్(23) గా గుర్తించారు. అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారణ చేపట్టగా గతంలోనూ రెండు చోట్ల ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు తెలిపాడు.

UnderwearThief Bizarre thief Bengaluru steals women s underwear wears it all night UnderwearThief

ఆ అండర్ వేర్ లతో అతడు సెక్సువల్ గా అసాంఘిక పనులు చేస్తున్నట్లు సీసీటీవీ ఫూటేజ్ లో వెల్లడైందని.. అతడు మానసికంగా అరుదైన సమస్యలతో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మహిళల దుస్తులు ధరించడం అనేది అతని సైకలాజికల్ వీక్ నెస్ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+