హైదరాబాద్: సామాజికన్యాయం టీడీపీ తోనే సాధ్యమని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. చిరంజీవి చెబుతున్న సామాజికన్యాయం నేతిబీరకాయ చందమని ఆయన ఆక్షేపించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సుమారు 800 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన నాలుగున్నరేళ్ల పాలనలో వై.ఎస్ అవినీతిసొమ్ముతో కోటలు కట్టారని ఆరోపించారు.